జాయింట్‌వీల్‌లో సాంకేతికలోపం…తలకిందులుగా ఇరుక్కుపోయారు!

4
- Advertisement -

హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో ప్రమాదం తప్పింది. పాపులర్ అమ్యూజ్‌మెంట్ రైడ్‌లో గందరగోళం ఏర్పడటంతో రైడర్‌లు సుమారు 25 నిమిషాల పాటు గాలిలో తలకిందులుగా చిక్కుకుపోయారు.

ట్రయల్ రన్ జరుగుతున్న సమయంలో బ్యాటరీ ఫెయిల్యూర్ కారణంగా రైడ్ ఆగిపోయింది. గాలిలో తలకిందులుగా ఉరుకుపడటంతో రైడర్‌లు భయాందోళనకు గురవ్వగా టెక్నీషియన్లు వెంటనే స్పందించి, బ్యాటరీని మార్చడంతో రైడ్ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. ఈ ఘటనను ఓ ప్రత్యక్ష సాక్షి వీడియో తీయగా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by The Siasat Daily (@siasatdaily)

- Advertisement -