రాష్ట్రానికి మరో దిగ్గజ సంస్థ ..!

73
saffron
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురాగా తాజాగా విమానయాన రంగ ఉత్పత్తులను తయారు చేసే ఫ్రాన్స్ కు చెందిన దిగ్గజ సంస్థ శాఫ్రాన్(SAFRAN) తన కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది.

15 కోట్ల డాలర్లతో (రూ.1200 కోట్లు) ఎంఆర్ఓ కేంద్రాన్ని శాఫ్రాన్ ఏర్పాటు చేయనుంది. ఇది విమాన ఇంజిన్ల నిర్వహణ, మరమ్మత్తు కేంద్రం. ఇండియాలో తన తొలి ఎంఆర్ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ ను ఎంచుకోవాలనుకున్న శాఫ్రాన్ నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఇక శాఫ్రాన్ సంస్థకు చెందిన అతిపెద్ద నిర్వహణ కేంద్రం ఇదేనన్న కేటీఆర్.. మన దేశంలో ఒక విదేశీ సంస్థ పెడుతున్న తొలి విమాన ఇంజిన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదేనని ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -