భవిష్యత్‌లో డేటా సెంటర్ల హబ్‌గా హైదరాబాద్ నిలవనుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, లైన్లు, స్తంభాలు లేకుండా భూగర్భ విద్యుత్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
గ్రేటర్ పరిథిలో స్మార్ట్‌పోల్స్ ఏర్పాటు చేయాలి అని… ఓఆర్‌ఆర్‌లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్దం చేయాలి అన్నారు. డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే 9.8 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగిందని అన్నారు. 2025, 2026లో 18,138 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అంచనా వేశారు.
తెలంగాణ రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. రైల్వేలైన్లు, మెట్రో, ఇతర మాస్ ట్రాన్స్‌పోర్ట్‌ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
Also Read:ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని:లోకేష్

