ప్రియాంక రెడ్డి హత్య..సీపీ ఎమన్నారంటే!

650
Cp Sajjanar
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక హత్య కేసును చేధించారు సైబరాబాద్ పోలీసులు. ఈ కేసులో కీలక ఆధారాలను మీడియా ముందు వివరించారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. అలాగే ఈహత్యకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించారు. ప్రియాంక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. 27వ తేదీ రాత్రి 11 గంటలకు శంషాబాద్ పోలీసులకు యువతి అదృశ్యమైనట్టు ఫిర్యాదు వచ్చిందని.. వెంటనే కేసు నమోదు చేసుకుని.. పోలీసులు యాక్షన్‌లో దిగారన్నారు.

అప్పుడే.. శంషాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఓ డెడ్‌బాడీని గుర్తించినట్టు.. న్యూస్ వచ్చిందని.. దీంతో ప్రియాంక తల్లిదండ్రులను పిలిచి డెడ్‌బాడీని.. గుర్తించమనగా.. అది వారి కూతురుదేనని చెప్పారు. దీంతో.. కేసును మరింత సీరియస్‌గా తీసుకుని.. 10 పోలీసు బృందాలు రంగంలోకి.. దర్యాప్తు చేసినట్టు సజ్జనార్ చెప్పారు. నిందితులను మహ్మద్ ఆరీప్ (26), జొల్లు శివ (20), జొల్లు నవీన్ (20), చెన్నకేశవులు(20)గా గుర్తించామని.. వెంటనే వారిని అరెస్ట్ చేశామని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా.. వారికి త్వరగా కేసు పడేలా చేస్తామని అన్నారు సజ్జనార్.

- Advertisement -