గుండెను పిండేసే విషాదం ఇది. అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారి చేసిన నేరమేంటి? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. నాన్న బైక్ ముందు సీట్లో కూర్చొని, “ఇంటికి వెళ్తున్నాం” అని ఆనందంగా సంబరపడే లోపే మృత్యువు మాంజా రూపంలో ఆమె మెడకు చుట్టుకుంది. క్షణాల్లో ఆ పాప గొంతు తెగిపోతుంటే, ఆ దృశ్యాన్ని చూసిన తండ్రి ఆవేదనను మాటల్లో చెప్పడం అసాధ్యం. ఆ బాధకు ఎవరు బాధ్యులు? చెప్పాలన్నారు.
సంక్రాంతి అంటే ఆనందం, ఐక్యత, కుటుంబంతో కలిసి సంతోషాలు పంచుకోవడం. కానీ కొందరి నిర్లక్ష్యం వల్ల పండుగ శోకంగా మారుతోంది. తమ సరదా కోసం వాడే చైనా మాంజా ఒక కుటుంబ జీవితాన్నే శాశ్వతంగా చీకట్లోకి నెట్టేసింది. అది కేవలం దారం కాదు; గాలిలో వేలాడే పదునైన కత్తి. అమాయకుల ప్రాణాలు తీసే మౌన హంతకుడు.
ప్లాస్టిక్ లేదా నైలాన్ మాంజా వాడకం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, మానవత్వానికి విరుద్ధం కూడా. చిన్న పిల్లల చేతికి మరణాయుధాలను ఇవ్వకండి. ఒక్క క్షణం సరదా కోసం మరొకరి జీవితాన్ని బలి చేయవద్దు. అమ్మితే ఉపేక్షించం. వాడితే వదిలిపెట్టం. ఇది హెచ్చరిక కాదు—బాధ్యత. ప్రతి ఒక్కరూ చైతన్యంతో వ్యవహరించాలి. ఒక చిన్నారి ప్రాణం మన నిర్లక్ష్యం వల్ల పోకూడదు అన్నారు.
Also Read:గ్రీన్ ఛాలెంజ్‌లో అశ్విని రాజ్‌కుమార్

