విధుల్లో చేరే కార్మికులకు పూర్తి భద్రతః సీపీ

366
Cp Anjani Kumar
- Advertisement -

నేటి నుంచి విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు పూర్తి స్ధాయిలో భద్రత కల్పించనున్నట్లు ప్రకటించారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. కార్మికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులతో భద్రత ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి డిపో వద్ద ఒక ఎస్ఐ తో భద్రత ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా, ధ్వంసం చేయడానికి ప్రయత్నించినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా నిన్న సాయంత్రం సీఎం కేసీఆర్ స్టెట్ మెంట్ తో చాలా మంది ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరుతున్నారు. ఇప్పటికే కొంత మంది తమ డిపో మేనేజర్లు సమ్మతి పత్రాలు అందజేసి డ్యూటీలో జాయిన్ అయ్యారు. విధుల్లో చేరిన ఆర్టీసీ ఉద్యోగులపై బెదిరింపులు, భౌతికదాడులకు పాల్పడితే వెంటనే స్ధానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

- Advertisement -