ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో… ప్రత్యేకతలివే

286
- Advertisement -

హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేందుకు సీఎం కేసీఆర్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలతో అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతోంది ప్రభుత్వం.

మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. నాగోల్ – రాయదుర్గం కారిడార్-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అప్పా కూడలిలోని పోలీసు అకాడమీ మైదానంలో బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు.

ఈ మెట్రోలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఎక్కువ మంది కూర్చొని ప్రయాణించేలా సీట్లు ఉంటాయి. ప్లాట్ ఫాంపై భద్రతకోసం అద్దాలతో కూడిన స్క్రీన్ విండోస్ ఏర్పాటు చేస్తారు. స్టేషన్‌లో మెట్రో రైలు ఆగిన తర్వాత కోచ్‌ల తలుపులు తెరచుకునే సమయంలోనే ఇవి తెరచుకుంటాయి.

రైళ్లు వేగంగా వెళ్లేందుకు వీలుగా ఏరో డైనమిక్స్‌లో మార్పు చేస్తారు. తేలికపాటి స్టెయిన్ లెస్ స్టీల్, అల్యూమినియం కోచ్‌లు ఉంటాయి. అదేవిధంగా స్టేషన్లలో విమాన రాకపోకల సమాచారం తెలిపే బోర్డులు ఏర్పాటు చేస్తారు.

ఇక ఈ ప్రాజెక్టు వ్యయం – రూ. 6,250 కోట్లు కాగా మొత్తం దూరం – 31 కి.మీ. ఆకాశమార్గం (ఎలివేటెడ్) – 27.5 కి.మీ, భూమార్గం (విమానాశ్రయంలో) – 1 కి.మీ ఉండనుఏంది. భూగర్భం (విమానాశ్రయంలో) 2.5 కి.మీ కాగా తొమ్మిది స్టేషన్లు ఉండనున్నాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్‌కు ప్రయాణానికి 26 నిమిషాలు పట్టనుండగా మూడేళ్లలో పూర్తి చేయనున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -