మన హైదరాబాద్ నిజంగా ‘సంపన్న’నగరమే. దేశంలో అత్యధిక సంపద ఉన్న నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. డిసెంబరు నాటికి హైదరాబాద్ నగర సంపద విలువ రూ.21.08 లక్షల కోట్లు (31,000 కోట్ల డాలర్లు) అని న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక వెల్లడించింది. 82,000 కోట్ల డాలర్ల ఆస్తులతో ఈ విషయంలో ముంబై మొదటి స్థానంలో ఉండగా 32,000 కోట్ల డాలర్లతో బెంగళూరు రెండో స్థానంలో ఉన్నాయి. బిలియనీర్ల (100 కోట్ల డాలర్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వ్యక్తులు) సంఖ్య విషయంలో కూడా హైదరాబాద్ దేశంలో మూడో స్థానంలో ఉంది.
మనకంటే ముందు ముంబై, బెంగళూరు నిలిచాయి. డిసెంబరు నాటికి హైదరాబాద్ మొత్తం సంపద విలువ రూ.21.08 లక్షల కోట్లు (31 వేల కోట్ల డాలర్లు). నగరంలో మిలియన్ డాలర్లకుపైగా సంపద ఉన్న వారి సంఖ్య 9 వేలు. ‘న్యూ వరల్డ్ వెల్త్’ నివేదిక తాజా లెక్కలివి.
సంఖ్యాపరంగా చూస్తే ముంబైలో అత్యధికంగా 46 వేల మంది మిలియనీర్లు ఉండగా కోల్‌కతా (9,600), హైదరాబాద్ (9 వేలు), బెంగళూరు (7,700), చెన్నై (6,600), పుణె (4,500), గురుగ్రామ్ (4 వేలు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక దేశంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్‌కు మూడో స్థానం దక్కింది. ఈ విషయంలో ముంబై 32 వేల కోట్ల డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా బెంగళూరు రెండోస్థానంలో నిలిచింది. బిలియనీర్ల సంఖ్యలోనూ భాగ్యనగరానికి మూడో స్థానం దక్కడం గమనార్హం.
ఇక భాగ్యనగరానికి మెట్రోరైలు ప్రాజెక్టు సరికొత్త అందాలు తెస్తోంది. 2012 జూన్‌లో హైదరాబాద్ మెట్రో రైలు పనులు ప్రారంభమయ్యాయి. 72 కిలోమీటర్ల పొడవైన మార్గం నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటికీ 76శాతం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మియాపూర్ నుంచి ఎస్‌ఆర్ నగర్ (12 కిలోమీటర్లు), నాగోలు నుంచి బేగంపేట (16 కిలోమీటర్లు) మార్గాన్ని ఈ ఏడాదిలో ప్రారంభించేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.