గ్రేటర్‌లో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేపట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేసిన కేటీఆర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని స్పష్టం చేశారు.ఉప్పల్ భాగాయత్ భూముల్లో మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటిన కేటీఆర్ సబర్మతి తరహాలో మూసీని అభివృద్ధి చేస్తామన్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగిస్తే ఉప్పల్ అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రానికి సహకరిస్తామని, కేంద్ర సహకారం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదన్నారు. ఉప్పల్ భాగాయత్ భూముల విషయంలో కేసీఆర్ చొరవ తీసుకుని రైతులకు న్యాయం చేశారని తెలిపారు.
హైదరాబాద్ ను ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించాలని యునెస్కోను కోరారు మంత్రి కేటీఆర్. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా చేసేందుకు పనిచేస్తున్నామని చెప్పారు. కుతుబ్ షాహీ టూంబ్స్ ల దక్కన్ పార్క్ ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయతోపాటు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా దక్కన్ పార్క్ ను డెవలప్ చేయాలని అధికారులకు సూచించారు కేటీఆర్. హైదరాబాద్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్న కేటీఆర్.. ఏటా పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుందన్నారు. హైదరాబాద్‌ను టూరిస్ట్ ఫ్రెండ్లీ నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు.
అన్ని అవరోధాలు అధిగమించి దక్కన్ పార్కును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పార్క్‌లో వాకర్స్‌కు అనుమతి ఉంటుందని తెలిపారు. హరితహారంలో భాగంగానే దక్కన్ పార్కును అభివృద్ధి చేయాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఏటా పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుందన్నారు. హైదరాబాద్‌ను టూరిస్ట్ ఫ్రెండ్లీ నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపడుతున్నామన్న మంత్రి.. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరాన్ని సురక్షిత, స్మార్ట్, అనుకూల ప్రాంతంగా తయారు చేయాలనేదే తమ ప్రయత్నమని ఉద్ఘాటించారు.