హుజుర్‌నగర్ :9 గంటలకు 13.44శాతం పోలింగ్

475
huzurnagar polling
- Advertisement -

హుజుర్‌నగర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 13.44 శాతం పోలింగ్ నమోదైంది. ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

మట్టంపల్లి మండలం గుండ్లపల్లి గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి. హుజూర్‌నగర్‌‌లో గెలుపును అన్ని పార్టీలూ సవాల్‌గా తీసుకున్నాయి. మరోవైపు ఓటింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది.

బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు ఉండగా ప్రధానంగా టీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య నెలకొంది. మొత్తం 302 పోలింగ్ కేంద్రాలు.. 1708 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో 2,36,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

- Advertisement -