హుజుర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. హుజూర్ నగర్ లో ఎలాగైనా ఈసారి గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంటే కంచు కోట స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. పోటీ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యే కనిపిస్తోంది.
హుజుర్ నగర్ అభివృద్దే ప్రధాన ఎజెండగా ఎన్నికల ప్రచారం సాగింది. టీఆర్ఎస్ తరపున కేటీఆర్‌తో పాటు పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ఎన్నికల ప్రచారం నిర్వహించగా కాంగ్రెస్ తరపున ఉత్తమ్‌తో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జానారెడ్డి,రేవంత్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉత్తమ్ పద్మావతి, బీజేపీ అభ్యర్దిగా డాక్టర్ కోట రామారావు, టీడీపీ నుంచి చావా కిరణ్మయి పోటీ చేస్తున్నారు. మొత్తం రెండు లక్షల 36 వేల మంది ఓటర్లుండగా ఈ నెల 21న పోలింగ్ జరగనుంది. 24న ఫలితాలు వెల్లడికానున్నాయి.