హుజుర్ నగర్ అభివృద్దే నా లక్ష్యంః సైదిరెడ్డి

375
saidireddy
- Advertisement -

హుజుర్ నగర్ నియోజక వర్గం అభివృద్ది చెందడమే తన లక్ష్యం అన్నారు టీఆర్ఎస్ నేత, హుజుర్ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్ది శానంపూడి సైదిరెడ్డి. ఎన్నికల ప్రచారం సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పండుగలకు, పెళ్లిళ్లకు తప్ప ఉత్తమ్‌ ఏనాడూ హుజూర్‌నగర్‌కు రాలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని ఉత్తమ్‌ ఏనాడు పట్టించుకోలేదన్నారు.

ఏ గ్రామానికి వెళ్లినా టీఆర్ఎస్ కే ఓటు వేస్తామని చెబుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పారు. జన్మభూమికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పనిచేస్తున్నట్లు తెలిపారు. గతంలో తాను ఓడిపోయినా ప్రజల్లో ఉండి పనిచేస్తున్న విషయాన్ని గమనించాలన్నారు. ఈ ఎన్నిక హుజూర్‌నగర్‌ అభివృద్ధికి అదృష్టం కొద్ది వచ్చిన ఎన్నికని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -