- Advertisement -
హుజుర్ నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. సూర్యపేటలోని వ్యవసాయ గోదాముల్లో కౌంటింగ్ ను నిర్వహిస్తున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత ఈవీఎంలు తెరవనున్నారు. కౌంటింగ్ కోసం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు.
22 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు జరుగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద 144సెక్షన్ ను అమలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2గంటల వరకు పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.
- Advertisement -