హుజూర్‌నగర్ అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల పర్వం ముగియనుంది.ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి, కాంగ్రెస్ తరఫున పద్మావతి, టీడీపీ అభ్యర్థిగా కిరణ్మయి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. చివరిరోజు ప్రధానపార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనుండటంతో పోలీసులు పటిష్టబందోబస్తు ఏర్పాటుచేశారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి నామినేషన్‌కు మంత్రులు జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి,కాంగ్రెస్ అభర్థి పద్మావతి నామినేషన్‌కు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీజేపీ అభ్యర్థి కోటా రామారావు నామినేషన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. లక్ష్మణ్ హాజరుకానున్నారు.
అక్టోబర్ 21న ఎన్నికలు జరుగుతాయి. 24న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి, బీజేపీ నుంచి కోట రామారావు ,టీడీపీ నుంచి చావా కిరణ్మయి,సీపీఎం నుంచి శేఖర్ రావు,ఇండిపెండెంట్‌గా తీన్మార్ మల్లన్న బరిలో ఉన్నారు.