- Advertisement -
హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి ఉత్తమ్ పద్మావతిపై 43,624 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. కారు స్పీడుకు హస్తం పార్టీ కుదేలవ్వగా బీజేపీ,టీడీపీ అడ్రస్ గల్లంతయ్యాయింది.
టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డికి 1,12,796 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతికి 69,563 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ అభ్యర్ధి సపవత్ సుమన్ 2693 ఓట్లతో మూడో స్ధానంలో నిలవగా బీజేపీ అభ్యర్ధి రామారావు 2,621 ఓట్లతో నాలుగో స్ధానంలో నిలిచారు. టీడీపీ అభ్యర్ధి చావా కిరణ్మయి 1827 ఓట్లు సాధించి ఐదో స్ధానంలో నిలిచారు.
- Advertisement -