- Advertisement -
మాజీ మంత్రి,హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ స్ధానిక టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున గళం వినిపిస్తున్నారు. హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రమ పలువురు కార్పొరేటర్లు ఈటెల కు వ్యతిరేకంగా తీర్మానం చేశారు.
తామంతా టీఆర్ఎస్ బీ ఫార్మ్ తోనే గెలిచామని టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకుంటామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆరే మా నాయకుడని..ఈటల వెంట నడిచే ప్రసక్తే లేదని తీర్మానం చేశారు. కేసీఆర్ వెంటే ఉంటామని కౌన్సిలర్లు వెల్లడించారు.
వీరి బాటలోనే పలు గ్రామాల టీఆర్ఎస్ నాయకులు బహిరంగంగానే ఈటలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -