సాధారణంగా భార్యభర్తలు వారి మనస్తత్వాలు, భావాలు కలవక విడాకులు తీసుకుంటారు. ఇక భార్య అయితే భర్త కొడుతున్నాడనో, వేరే వాళ్లతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని విడాకులు కోరుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన భార్యకు మగవారి లక్షణాలు ఉన్నాయని తన నుంచి విడాకులు కావాలని అహ్మదాబాద్ కోర్టును ఆశ్రయించాడు. ఆ వ్యక్తి పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.
తన భార్యకు గడ్డం పెరుతోందని, గొంతు కూడా మగవారి మాదిరిగా ఉందని ఆ వ్యక్తి పిటిషన్ లో పేర్కొన్నాడు. పెళ్లి చూపులకు వెళ్లినప్పుడు పరదా కట్టి కూర్చోబెట్టి తనకు కనిపించనివ్వలేదని, పెళ్లి సమయంలోనూ పరదా తీయాలని కోరినప్పటికీ అమ్మాయి బంధువులు సాంప్రదాయానికి విరుద్దం అంటూ తనను చూడనివ్వలేదని ఆ వ్యక్తి ఆరోపించాడు.
అమ్మాయి బంధువులు అందరూ కలిసి తనను మోసం చేశారని ఆరోపించాడు. ఆ వ్యక్తి పిటిషన్ ను స్వీకరించిన న్యాయ స్థానం అతని భార్యను విచారించింది. అవును నా శరీరంలో హర్మోన్ల ప్రాబ్లం ఉంది. కానీ అవాంచిత రోమాలను తొలగించే అవకాశం ఉందని తెలిపింది. తన భర్త తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తెలిపింది. దీంతో విడాకులు మంజూరు చేయలేమంటూ పిటిషన్ ను కొట్టివేసింది న్యాయస్థానం.