శ్రీరాం సాగర్‌కు భారీ వరద..

12
- Advertisement -

భారీ వర్షాలతో శ్రీరాం సాగర్‌కు వరద ప్రవహం కొనసాగుతోంది. ఎగువ నుండి ప్రాజెక్టులోకి 59,078 క్యూసెక్కుల నీరు వస్తుండగా 16 గేట్లు ఎత్తి 49,960 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాం సాగర్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1091 అడుగుల గరిష్టాన్ని తాకింది.

అలాగే కడెం జలాశయానికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రాజెక్టులోకి 21,100 క్యూసెక్కుల వరద వస్తుండగా, అధికారులు 2 గేట్లు ఎత్తి 17,745 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 696.200 అడుగులకు నీటి ప్రవాహం చేరింది.

Also Read:క్యాబేజీతో ఆరోగ్య ప్రయోజనాలు..!

- Advertisement -