భారీ వర్షాలతో శ్రీశైలంకు పోటెత్తిన వరద

27
- Advertisement -

భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. 100 టీఎంసీలకు పైగా శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు చేరింది. జురాల నుండి భారీగా వరద నీరు చేరుతుండగా జలాశయం ఇన్ఫ్లో 2,32,843 క్యూసెక్కులుగా ఉండగా జలాశయం అవుట్ 31,784 క్యూసెక్కులుగా ఉంది.

జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా జలాశయం ప్రస్తుత నీటిమట్టం 859 అడుగులు. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215. 807 టీఎంసీలు కాగా జలాశయం ప్రస్తుత నీటి సామర్థ్యం 102.8910 టీఎంసీలుగా ఉంది. జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Also Read:Harishrao:రుణమాఫీలో కొత్త చిక్కులు, ఆధారాలతో హరీష్ ట్వీట్

- Advertisement -