శ్రీశైలం,జురాలకు భారీగా పోటెత్తిన వరద

101
srisailam
- Advertisement -

ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశానికి 3,50,341 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతోంది. దీంతో అధికారులు 2,51,847 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.8 అడుగుల వద్ద నీరు ఉన్నది.

జురాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి జూరాలకు 1.75 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 36 గేట్లు ఎత్తి 1.85 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 అడుగులు కాగా, ఇప్పుడు 318.16 అడుగుల వద్ద నీరు ఉంది.

- Advertisement -