శ్రీశైలం, సాగర్‌కు పోటెత్తిన వరద..

125
sagar
- Advertisement -

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు వరద ప్రవాహం పోటెత్తింది. సాగర్‌కు భారీగా వరద వస్తుండటంతో అధికారులు 22 గేట్లను ఎత్తివేశారు. దీంతో స్పిల్‌వే ద్వారా 3.48 లక్షల క్యూసెక్కుల నీరు బయటకు వెల్తున్నది. ప్రాజెక్టులోకి 3.9 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, అంతేమొత్తంలో దిగువకు వెళ్తున్నది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 588.20 అడుగుల వద్ద ఉంది.

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 2.10 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 2.17 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 3,56,442 క్యూసెక్కుల వరద వస్తున్నది. అధికారులు 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తివేత 3.78 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్‌వే ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తంగా 4,40,991 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉన్నది. నీటి నిల్వ 215.8070 టీఎంసీలు. ఇప్పుడు 214.3637 టీఎంసీలు ఉన్నాయి.

- Advertisement -