జూరాలకు కొనసాగుతున్న వరద

54
- Advertisement -

జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 72 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా దీంతో అధికారులు ఆరు గేట్లు ఎత్తి 70,713 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతుండగా ప్రాజెక్టుకు 1,25,659 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 19,070 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా, ప్రస్తుతం 880 అడుగుల వద్ద నీరు ఉంది.

- Advertisement -