నాగార్జున సాగర్ కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 26 గేట్లు ఎత్తి దిగువకు 2,08,416 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో 2,28,601 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 2,47,986 క్యూసెక్కులుగా ఉంది.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం : 589.20గా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం: 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం: 309.95 టీఎంసీలుగా ఉంది.
మరోవైపు మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తింది. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు మూసీకి వరద ప్రవాహం పెరుగగా మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 643.15 అడుగులు కాగా ఇన్ ఫ్లో 9409.31 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో….10,755.58 క్యూసెక్కులుగా ఉంది. 5 గేట్ల ద్వారా మూడు ఫీట్ల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.
Also Read:ఇండిగోకు DGCA షోకాజ్ నోటీసులు

