జురాలకు భారీగా పెరిగిన వరద ప్రవాహం…

160
srisailam
- Advertisement -

మూడు రోజులుగా గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం దిగువకు ఉరకలేస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టు భారీ వరద ప్రవాహం పెరింది. జూరాల జలాశయం పూర్తి నీటి మట్టం 318 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్లుగా ఉంది.

జలాశయం పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 8.203 టీఎంసీలుగా ఉంది. 2లక్షల 52 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 25 గేట్ల ద్వారా లక్షా 92 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ.. శ్రీశైలంకు చేరుతోంది. జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది

- Advertisement -