తిరుమలకు పోటెత్తిన భక్తులు..

199
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు రాగా తిరుమల కిక్కిరిసిపోయింది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుండగా తిరుమల పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి.

నిన్న స్వామివారిని 84,878 మంది భక్తులు దర్శించుకోగా 41,016 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కానుకల ద్వారా హుండి ఆదాయం రూ.3.86 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -