యాదాద్రికి పెరిగిన భక్తుల రద్దీ..

64
yadadri
- Advertisement -

యాదా ద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే స్వామి ఆలయానికి భక్తులు పొటెత్తారు. దీంతో నారసింహుని ధర్మదర్శనానికి గంట సమయం, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పడుతున్నదని అధికారులు తెలిపారు.

రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నాడు. శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఏఈవో గట్టు శ్రవణ్ కుమార్ తీర్థ ప్రసాదాలు అందజేశారు.

- Advertisement -