TTD:తిరుమలకు పోటెత్తిన భక్తులు

6
- Advertisement -

జూన్ 17 వరకు వారాంతపు సెలవులు ఉండడంతో శనివారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, కల్యాణ వేదిక వరకు బయట క్యూ లైన్లు యాత్రికులతో నిండిపోయాయి.

గురువారం నుంచి యాత్రికుల తాకిడి తగ్గలేదు, సోమవారం కూడా సెలవు దినం కావడంతో భక్తుల రాద్దీ కొన సాగనుంది.శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తోంది.

టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ప్రత్యక్ష పర్యవేక్షణలో సీనియర్ అధికారులు , విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, టీటీడీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదం, తాగునీటిని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

Also Read:Vishnu:ప్రతి సోమవారం కన్నప్ప అప్‌డేట్

- Advertisement -