తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

30
- Advertisement -

తిరుమలకు భక్తులకు రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మొత్తం కంపార్ట్మెంట్ నిండిపోయాయి. క్యూలోకి వెళ్లిన భక్తులకు 48 గంటలకు పైగా దర్శన సమయం పట్టే అవకాశం ఉంది. కొండపై అనూహ్య రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచించింది. భక్తుల రద్దీ పెరిగిపోవడంతో మూడు రోజుల పాటు వీఐపీ బ్రేక్ ద‌ర్శనాల‌ను ర‌ద్దు చేస్తున్నట్టు తెలిపింది.

మరో నాలుగు రోజుల పాటు రద్దీ ఉంటుందని.. భక్తులు తిరుమలకు రావొద్దని టీటీడీ ఈవో ధర్మారెడ్డి సూచించారు. భ‌క్తుల ర‌ద్దీ పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని.. బ్రేక్‌ దర్శనాలకు వచ్చే భ‌క్తులు త‌మ ప్రయాణాల‌ను వాయిదా వేసుకోవాల‌ని టీటీడీ సూచించింది.

గతంలో టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాట లాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది.

- Advertisement -