ఆకట్టుకుంటున్న ‘రూల్స్ రంజన్’ ట్రైలర్

20
- Advertisement -

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’.సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కలయికలో వస్తున్న సినిమా కావడంతో రూల్స్ రంజన్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘నాలో నేనే లేను’, ‘సమ్మోహనుడా’, ‘ఎందుకురా బాబు’ పాటలు ఒక దానికి మించి ఒకటి అన్నట్లుగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి.

తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. ఈ ట్రైలర్ ఫుల్ ఫన్ మోడ్ లో ఉందనే చెప్పాలి. నటుడు వెన్నెల కిషోర్ అలానే కిరణ్ అబ్బవరం టైమింగ్ లు సాలిడ్ గా పేలాయి. మాస్ ఎలిమెంట్స్ ని తగ్గించి కిరణ్ నుంచి ఫుల్ ఫన్ తో ఈ సినిమాని మేకర్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. అలాగే హీరోయిన్ నేహా శెట్టి తన గ్లామ్ తో పాటుగా కిరణ్ అబ్బవరం తో మంచి కెమిస్ట్రీ కూడా కనబరిచింది.

Also Read:కోటబొమ్మాలి పిఎస్…ఫోక్ సాంగ్

- Advertisement -