టీఎస్‌పీఎస్సీ పదవులకు భారీ దరఖాస్తులు..

28
- Advertisement -

టీఎస్పీఎస్సీ పదవుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. గడువు ముగిసే సమయానికి 900 లకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. గురువారం ఒక్కరోజే 580కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఆన్ లైన్ విధానంలో చైర్మన్, 4 గురు సభ్యులకు దరఖాస్తులు ఆహ్వానించింది ప్రభుత్వం.

నిన్న అర్ధరాత్రి 12 గంటలతో ముగిసిన గడువు ముగిసింది. టీఎస్పీఎస్సీలో వివిధ పోస్టులకు పలువురు ప్రముఖులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రముఖుల్లో మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also Read:‘గుంటూరు కారం’ ఘనవిజయం: నిర్మాత నాగవంశీ

- Advertisement -