కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెన్ తో ఆసక్తిని రేకెత్తించింది. పోస్టర్‌లు, ఫస్ట్ టీజర్, ఫస్ట్ సింగిల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్‌లో విడుదలకు సన్నాహాలు చేసిన మేకర్స్, జనవరి 14న సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేశారు.
సినిమా టైటిల్ సాంగ్-నా సామి రంగ లిరికల్ వీడియో విడుదల చేశారు. ఆస్కార్ అవార్డ్ విజేతల ద్వయం- ఎంఎం కీరవాణి క్యాచీ ట్రాక్, చంద్రబోస్ మాస్ లిరిక్స్‌తో ఈ పాట మెస్మరైజ్ చేసింది. ‘మా జోలికొస్తే.. మాకడ్డు వస్తే.. మామూలుగా వుండదు.. నా సామిరంగ.. ఈ గీత తొక్కితే.. మా సేత సిక్కితే.. మాములుగా వుండదు.. నా సామిరంగ’ అనే పదాలు కథానాయకుడి పాత్రని తెలియజేస్తూ మాస్ ని ఆకట్టుకునేలా వున్నాయి.
ఈ పాటని కాల భైరవ & రాహుల్ సిప్లిగంజ్ హై ఎనర్జీతో ఆలపించారు. ప్రధాన తారాగణం తో పాటు 300 మంది డ్యాన్సర్స్ తో లావిష్‌గా చిత్రీకరించిన పాటకు దినేష్ మాస్టర్ అందించిన కొరియోగ్రాఫర్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. నాగార్జున తన మాస్ స్వాగ్ తో కట్టిపడేశారు. నాగార్జున, అల్లరి నరేష్ లుంగీలో మాస్ అవతారాల్లో ఆకట్టుకుంటే, రాజ్ తరుణ్ ఫార్మల్స్ లో కనిపించారు. నాగార్జునతో కలిసి అల్లరి నరేష్, రాజ్ తరుణ్ డ్యాన్స్ చేయడం కన్నుల పండగలా వుంది.
మంచి ప్రేమకథ, స్నేహం, భావోద్వేగాలు, మాస్ ,యాక్షన్ ఎలిమెంట్స్ కూడిన నా సామిరంగ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అని ప్రోమోలు ప్రామిస్ చేస్తున్నాయి. నాగార్జున సరసన ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివేంద్ర దాశరధి సినిమాటోగ్రఫీ అందించారు.బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.
Also Read:వింటర్ లో నిమ్మరసం తాగితే ఎన్ని ప్రయోజనాలో..?