యూ ట్యూబ్‌ని షేక్ చేసిన మహర్షి…

295
maharshi
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ మహర్షి. మహేశ్ సరసన పూజా హెగ్డె కథానాయికగా నటించగా అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఉగాది కానుకగా టీజర్‌ని విడుదల చేశారు.ఈ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

1.19 సెకన్ల నిడివివున్న ఈ టీజర్ వీడియోలో మహేశ్, చాలా స్టయిలిష్ గా చూపించారు. టీజర్ మొదటి 13 గంటల్లోనే 9 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇక 24 గంటలు పూర్తయ్యేసరికి 12.6 మిలియన్ల వ్యూస్ పొందింది. ఒక తెలుగు సినిమా ఈ స్థాయిలో వ్యూస్ సాధించడం ఇదే మొదటిసారి.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈచిత్నాన్ని దిల్ రాజు, అశ్వినిదత్, పివిపిలు సంయుక్తంగా నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 9వ తేదీన విడుదలకానుంది.

- Advertisement -