కన్నప్ప టీజర్ @ 20 మిలియన్

9
- Advertisement -

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా.మోహన్ బాబు నిర్మించిన ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం టీజర్‌ని రిలీజ్ చేయగా ఇది ఆకట్టుకుంది.

ఇక ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చ‌క్క‌టి విజువ‌ల్స్, ఆక‌ట్టుకునే యాక్ష‌న్ తో ఈ టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ 20 మిలియ‌న్ల వ్యూస్ మార్క్ ను దాటింది.

విష్ణుతో పాటు అక్ష‌య్ కుమార్, మోహ‌న్ బాబు, ప్ర‌భాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ అనౌన్స్‌ చేయనున్నారు.

Also Read:ఆసీస్‌పై ఆఫ్ఘాన్‌ సంచలన విజయం

- Advertisement -