Jagan:’సిద్దం’ తో జగన్ ఊపిరొచ్చిందా?

75
- Advertisement -

వైసీపీపై తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉందని.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని.. నిన్న మొన్నటి వరకు ప్రత్యర్థి పార్టీల నేతలు గుప్పించిన విమర్శలు ఇవి. పైగా జగన్ నిర్వహిస్తున్న సభలకు ప్రజలు మొఖం చాటేస్తున్నారని, వైసీపీ నేతల్లో ఓటమి భయం ఆవహించిందని ఈ రకమైన వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. దీనికి తోడు అధినేత జగన్ అధిక స్థాయిలో ఇంచార్జ్ ల మార్పు చేపట్టడం, ఆయా సర్వేలు టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఫలితాలు ఇవ్వడంతో ఈసారి నిజంగానే వైసీపీకి ప్రజలు షాక్ ఇవ్వబోతున్నారా అనే సందేహాలు చాలమందిలో వ్యక్తమౌతూ వచ్చాయి.

అయితే ఆ అనుమానాలన్నిటిని పటాపంచలు చేస్తూ ఇటీవల రాప్తాడులో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. తండోపతండాలుగా ప్రజల రాకను చూసి వైసీపీ నేతలకు కొత్త ఊపిరొచ్చినట్లైంది. ఊహించని రీతిలో ప్రజా మద్దతు దక్కడంతో రెండోసారి కూడా వైసీపీ విజయం పక్కా అనే భావనతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఈసారి రాప్తాడుఅను మించి అనేలా మార్చి 2 న పల్నాడు జిల్లాలోని చిలకలూరి పేట నియోజక వర్గంలో మరో సిద్దం బహిరంగ సభకు ఏర్పాటు చేసేందుకు సిద్దమౌతున్నారు వైసీపీ నేతలు.

ఈ సభ కూడా సక్సస్ అయితే వైసీపీలో మరింత జోష్ పెరిగే అవకాశం ఉంది. పైగా ఈసారి నిర్వహించే సిద్దం సభలో మేనిఫెస్టో ప్రకటించేందుకు జగన్ రెడీ అయినట్లు టాక్. అదే గనుక జరిగే పార్టీకి మరింత ఊపునిస్తుంది. ఈసారి ఎన్నికల్లో 175 స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యం తో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదే విషయాన్ని ఇటీవల రాప్తాడు సభలో కూడా నొక్కి చెప్పారు. ఈ ఐదేళ్లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చమని, మంచి జరిగిందని భావిస్తేనే ఓటు వేయండని జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారు. మరి సిద్దం కార్యక్రమంతో నయా జోష్ లోకి వచ్చిన వైసీపీ.. ఎలక్షన్ వరకు ఇదే జోష్ కొనసాగిస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తోంది. మరి సిద్దం సభలలో కనిపిస్తున్న ప్రజా మద్దతు ఓటుగా మారుతుందా లేదా అనేది చూడాలి.

Also Read:ఇంగువతో ఆరోగ్య ప్రయోజనాలు..

- Advertisement -