‘హరోం హర’కి అద్భుతమైన రెస్పాన్స్

8
- Advertisement -

నవ దళపతి సుధీర్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన హరోం హర అన్ని వర్గాల ప్రేక్షకులు ఆకట్టుకొని, బ్లాక్ బస్టర్ హిట్ సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో నిర్మాతలు సుబ్రహ్మణ్యం, సుమంత్ జి నాయుడు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

సుబ్రహ్మణ్యం గారు.. హరోం హర తో సూపర్ హిట్ కొట్టారు. ముందుగా మీకు కంగ్రాట్స్..
-అందరికీ థాంక్ యూ. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చాలా మంచి రేటింగ్స్ వచ్చాయి. మంచి సినిమా చేశామని అందరూ అభినందిస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి దర్శకులు మారుతి గారు, సంపత్ నంది ఫోన్ చేసి మంచి సినిమా తీశారని చెప్పారు. ఖచ్చితంగా ఓ మంచి సినిమా తీస్తామని ముందు నుంచి చెబుతున్నాం. ఇప్పుడు అదే జరిగింది. కలెక్షన్స్ చాలా బావున్నాయి. అన్ని చోట్ల హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.

-దర్శకుడు సాగర్ మీద పూర్తి నమ్మకం పెట్టాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు.

సుమంత్ గారు.. హరోం హరోతో మీ జర్నీ గురించి చెప్పండి ?
డాడీ బిజినెస్ కారణంగా రాజమండ్రిలో వుండేవారు. ఈ సినిమా షూటింగ్ లో వందశాతం నా ఇన్వాల్మెంట్ వుండేది. ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ దగ్గరుండి చూసుకున్నాను.

సుమంత్ గారు.. మీకు ఇష్టమైన హీరోలు ?
నాకు ప్రభాస్, రామ్ చరణ్ గారంటే చాలా ఇష్టం. స్టెప్ బై స్టెప్ వెళ్లి వాళ్ళతో సినిమా చేయాలని వుంది.

సుబ్రహ్మణ్యం గారు.. సుధీర్ బాబు గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
సుధీర్ బాబు గారితో కలసి పనిచేయడం చాలా బావుంది. చాలా మంచి ఎక్స్ పీరియన్స్.

సుధీర్ బాబు గారి సమ్మోహనం సినిమాని ముందు మీరే ప్రోడ్యుస్ చేయాలనుకున్నారని విన్నాం.?
-అవునండీ.. సమ్మోహనం నేనే చేయాలి. ఇంద్రగంటి గారితో కూడా రెండు మూడు మీటింగులు కూడా అయ్యాయి. అయితే కొన్ని కారణాలు వలన అది చేయడం కుదరలేదు. అది చాలా మంచి సినిమా. ఫ్రీ టైం లో ఆ సినిమా చాలా సార్లు చూస్తుంటాను.

హరోం హరలో హీరోయిన్ మాళవిక అద్భుతంగా చేశారు. కానీ ప్రమోషన్స్ లో కనిపించకపోవడానికి కారణం ?
-మాళవిక చాలా మంచి యాక్టర్. తన పెర్ఫర్మెన్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. తను లా చదువుతుంది. ఎగ్జామ్స్ వుండటం వలన ప్రమోషన్స్ కి రావడం కుదరలేదు.

చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది కదా ?
-చైతన్ చాలా ఫ్రండ్లీ గా ఉంటారు. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాకి టాప్ అతనే. కెమరామ్యాన్ కూడా అద్భుతంగా చేశాడు.

Also Read:మిస్టర్ బచ్చన్..ఇంట్రెస్టింగ్ న్యూస్

సుబ్రహ్మణ్యం గారు.. హరోం హర కథలో మీకు నచ్చిన ఎలిమెంట్ ?
తండ్రి కొడుకుల సెంటిమెంట్ చాలా నచ్చింది. నేను మా అబ్బాయి కూడా అలానే వుంటాం. ఎదున్నా షేర్ చేసుకుంటాం. అలాగే ఫైట్స్ కూడా టాప్ గా వున్నాయి. ఫైట్స్ కోసం సినిమాని దాదాపు పదమూడుసార్లు చూశాను.

హరోం హర బ్లాక్ బస్టర్ ని కంటిన్యూ చేస్తూ మరో ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారని విన్నాం ?

-రెండు మూడు ప్రాజెక్ట్స్ వున్నాయి. సినిమాల్లో వుండాలని, మా అబ్బాయిని ఇక్కడే వుంచాలని నా గట్టి నిర్ణయం. మాకు సినిమాలు అంటే చాలా పాషన్. మీ అందరి సపోర్ట్ తో ఇక్కడే కొనసాగాలని కోరుకుంటున్నాం.

- Advertisement -