TCDAA ఫిలిమ్స్ బ్యానర్ పై సూర్యవేణి ప్రభు రాజు, విజయలక్ష్మి శ్రీను నిర్మాతలుగా ప్రభు రాజు దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా “అభిమాని” హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఈ సినిమా ప్రత్యేకమైన ప్రీమియర్ వేశారు దర్శక నిర్మాతలు. దీనికి అద్భుతమైన స్పందన తో పాటు ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని.. ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుతున్నామని దర్శక నిర్మాత లు తెలిపారు.
హీరో … మాట్లాడుతూ.. ‘ఈ సినిమా చాలా కష్టపడి చేశాము. దీని కోసం అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద సినిమాకు కొట్టినట్టు చాలా అద్భుతంగా సంగీతం అందించారు. ఎడిటర్ వర్క్ చాలా బాగుంది. మా నిర్మాత గురించి ఎంత చెప్పినా తక్కువే.. సినిమా కోసం వాళ్లు ఎంతో కష్టపడ్డారు.. మా దర్శకుడు ప్రభు రాజు ఒక మంచి కథను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మా సినిమాను ఇంత అద్భుతంగా ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..’ అని తెలిపారు.
దర్శకుడు ప్రభు రాజు మాట్లాడుతూ.. ‘ ఈ సినిమా కోసం ఎన్నో రోజుల నుంచి నేను కష్టపడుతున్నాను. నాతో పాటు నా యూనిట్ కూడా చాలా ఇష్టపడి పని చేశారు. ఈ రోజు మా కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది అనుకుంటున్నాను. సినిమా మీకు నచ్చుతుందని.. ప్రతి ఒక్కరు ఆదరిస్తారని నమ్మకం ఉంది..’ అని తెలిపారు. సంగీత దర్శకుడు మాట్లాడుతూ.. ‘ ఈ సినిమా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత మంచి సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు..’ అని తెలిపారు.