భారీ వర్షాలు..అత్యవసరమైతేనే బయటకు రండి!

72
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మబ్బులకు చిల్లు పడింది అనేలా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రజలు బయటకి రావాలంటేనే జంకుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 12 గంటల పాటు బలమైన ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గాలులు కొనసాగుతాయని వెల్లడించింది.

గాలు తీవ్రతకు చెట్లు విరిగిపడే అవకాశం ఉందని…..ప్రజలతో పాటు అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గాలులకు చెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందున వర్షం కురిస్తే ఎవరూ చెట్ల కింద ఉండొద్దని చెప్పింది.

అత్యవసర సమయాల్లో డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని…ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు బృందాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది.

- Advertisement -