గుజరాత్ లో వర్ష బీభత్సం.. 63 మంది మృతి

100
gujarath
- Advertisement -

భారీ వర్షాలు పలు రాష్ట్రాలను ముంచెత్తాయి. వర్షాలతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో వాగులు వంకలు పొంగిపొర్లుతుండగా ఇక గుజరాత్ ను అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా గుజరాత్ లోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.

వర్షాల కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటివరకు వర్షాలతో 63 మంది మృతిచెందగా భారీ వర్షాలతో సతమతమవుతున్న గుజరాత్ కు కేంద్రం నుంచి అవసరమైనంత సాయం చేస్తామని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు తెలిపారు.

ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ లకు చెందిన ప్లటూన్లు 18 చొప్పున కీలక ప్రాంతాల్లో మోహరించాయని అమిత్ షా తెలిపారు. ఎక్కడ అవసరమైతే అక్కడకు వెంటనే చేరుకుని సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ బలగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

- Advertisement -