ఉల్లి ఘాటు. రాత్రికి రాత్రే కోటిశ్వరుడైన రైతు

509
Onion Former
- Advertisement -

దేశ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ఉల్లి కన్నీరు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఉల్లి రేటు అమాంతం పెరిగి సామాన్యులకు ఇబ్బందిగా మారింది. ఉల్లి రేటు పెరిగిపోవడంతో తాజాగా ఓ రైతు రాత్రికి రాత్రే కోటిశ్వరుడయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..కర్ణాటకకు చెందిన మల్లికార్జున అనే రైతు తనకు ఉన్న 20ఏకరాల పొలంలో ఉల్లి సాగు చేశాడు. ప్రతి సారి ఉల్లి వేసినప్పుడు భారీగా లాస్ వచ్చే ది. ఇక చివరగా ఈ సారి అప్పు తెచ్చి మరి తన పొలంలో ఉల్లిని సాగు చేశాడు. దీంతో ప్రస్తుతం ఉల్లి రేటు పెరగడంతో ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది.

మల్లికార్జున సాగుచేసిన 20 ఎకరాల్లో 240 టన్నుల ఉల్లి దిగుబడైంది. దాదాపు 20 ట్రక్కుల్లో పట్టేంత ఉల్లి పండటం… అదే సమయంలో… దేశవ్యాప్తంగా ఉల్లికి ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడటంతో మల్లికార్జున దశ మారిపోయంది. 100 కేజీల ఉల్లిని రూ.7000కు అమ్మాడు. మొత్తం రూ.1.68 కోట్ల ఆదాయం వచ్చింది. అప్పులన్నీ ఒక్కసారిగా వదిలిపోయాయి. దాదాపు వంద మంది కూలీలు ఆయన పొలంలో పనిచేస్తున్నారు. తన పంటలో పండిన ఉల్లిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాడు.. పంటకు ఇప్పటి వరకు రూ. 15 నుంచి 20 లక్షల పెట్టుబడి పెట్టనని, దాదాపుగా కోటి వరకు లాభం వచ్చినట్టుగా ఆ రైతు చెప్పుకొచ్చాడు.

- Advertisement -