టీటీడీ దేవస్థానానికి విరాళాలు భారీగా వచ్చాయి. హైదరాబాద్ కు చెందిన ఏడీవో ఫౌండేషన్ అనే ఎన్జీవో సంస్థ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.75 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ శ్రీ కుప్పాల గిరిధర్ కుమార్ అనే భక్తుడు ఆదివారం రాత్రి టీటీడీ ఎస్వీ విద్యాదానం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. గుంటూరుకు చెందిన అభయహస్త ఫైనాన్స్ సర్వీసెస్ సీఎఫ్ఓ శ్రీ సింహాద్రి వెంకట శివ ప్రసాద్ అనే భక్తుడు టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు.
బెంగుళూరుకు చెందిన శ్రీ ఎం.రాకేశ్ రెడ్డి అనే భక్తుడు సోమవారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, జంగా కృష్ణమూర్తి లు పాల్గొన్నారు.
Also Read:కోమటిరెడ్డి మరోసారి సంచలనం..

