తిరుమలకు పోటెత్తిన భక్తులు..

31
ttd
- Advertisement -

తిరుమలకు భక్తులు పోటెత్తారు.వరుసగా సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు తరలివస్తున్నారు. అలిపిరి నడక మార్గం దగ్గర భక్తుల రద్దీ కనిపిస్తోంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వందలాది వాహనాలు బారులు తీరాయి. వచ్చే మూడు రోజుల పాటు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది.

సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 63వేల 754 మంది దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.3.63 కోట్లు ఆదాయం వచ్చింది. 30వేల 790 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో ప్రధానంగా సెప్టెంబర్‌ 27న ధ్వజారోహణం, అక్టోబర్ 1న గరుడ సేవ, అక్టోబర్‌ 2న స్వర్ణరథం, అక్టోబర్‌ 4న రథోత్సవం, అక్టోబర్‌ 5న చక్రస్నానం నిర్వహిస్తారు.

- Advertisement -