Congress:టీపీసీసీ రేసులో ఆ నలుగురు!

11
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం ముగియడంతో నామినేటెడ్ పోస్టులు, కొత్త పీసీసీ అధ్యక్ష నియామకంపై దృష్టి సారించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నెల 27తో పీసీసీ చీఫ్గా రేవంత్ పదవీకాలం ముగియనుండగా ఆలోపే కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది.

సామాజిక వర్గ సమీకరణల ఆధారంగా కొత్త పీసీసీ చీఫ్ ఎన్నిక ఉండే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ సీఎంగా ఉండటంతో పీసీసీ చీఫ్‌గా బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. పీసీసీ చీఫ్‌తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాలు కూడా ఒకేసారి జరగనున్నాయి.

బీసీలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కీ, ఎంపీ సురేష్ షెట్కర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక జగ్గారెడ్డి సైతం తనకే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎస్సీ కోటాలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు పేర్లు వినిపిస్తుండగా ఎవరిని అధ్యక్ష పదవి వరిస్తుందోనని కేడర్ సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Also Read:ల‌వ్ మాక్‌టైల్ 2..రిలీజ్ డేట్

- Advertisement -