మహేష్ కోసం ఆ ముగ్గురు రెడీ

29
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో ఓ భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే, మహేష్ రాజమౌళి సినిమా తర్వాత మళ్లీ త్రివిక్రమ్ తో కలిసి మరో సినిమా చేస్తాడట. రీసెంట్ గా మ‌హేష్ బాబుతో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మిక్స్​డ్​ టాక్ తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీతో సినిమాను ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ అనౌన్స్ చేశాడు. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో త్రివిక్ర‌మ్ మ‌రోసారి మ‌హేష్ బాబుతో క‌లిసి వ‌ర్క్ చేయ‌నున్న‌ట్లు వార్తలు రావడం విశేషం. పైగా ఈసారి త్రివిక్ర‌మ్–మ‌హేష్ కోసం యాక్ష‌న్ స్టోరీ రెడీ చేస్తున్నాడ‌ని టాక్.

ఇదిలా ఉంటే.. మహేష్ కోసం మరో క్రేజీ డైరెక్టర్ కూడా ఓ కథ రెడీ చేశాడట. టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న డైరెక్ట‌ర్ల‌లో సుజీత్ కూడా ఒక‌డు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్న సుజీత్, త‌న త‌ర్వాతి సినిమాను నానితో చేయ‌నున్నాడ‌ని వార్త‌లొస్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం, సుజీత్ త‌ర్వాతి సినిమా హీరోల లిస్ట్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా ఉన్నాడ‌ని తెలుస్తోంది. మ‌హేష్ కోసం సుజీత్ ఓ గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామాను రెడీ చేస్తున్న‌ట్లు స‌మాచారం. అలాగే మహేష్ బాబు కోసం కొరటాల శివ కూడా ఓ పవర్ ఫుల్ కథను రెడీ చేశాడు.

ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తున్నాడు. దేవర సీక్వెల్ అయిపోయిన వెంటనే కొరటాల శివ మహేష్ తో సినిమా చేసే అవకాశం ఉంది. కాకపోతే కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం చిక్కుల్లో పడింది. ఈ చిత్రానికి సంబంధించిన కథను తాను రాసిన నవల ‘చచ్చేంత ప్రేమ’ను కాపీ కొట్టి తీశారని రచయిత శరత్‌ చంద్ర హైదరాబాద్‌ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తర్వాత ఈ వ్యవహారం హైకోర్టుకి చేరింది. అక్కడి నుండి సుప్రీం కోర్టుకు చేరగా ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ క్రిమినల్‌ కేసు ఎదుర్కోవాల్సిందేనని తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా కొరటాల శివ – మహేష్ కాంబినేషన్ మళ్లీ సెట్ కావడం విశేషమే.

Also Read:TTD: రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు

- Advertisement -