‘గేమ్‌ ఛేంజర్‌’ రైట్స్ కి ఫుల్ క్రేజ్

16
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న గేమ్‌ ఛేంజర్‌ మూవీ విడుదల తేదిపై రకరకాల రూమర్స్ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ ఓవర్సీస్ రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ‘గేమ్‌ ఛేంజర్‌’ ఓవర్సీస్ రైట్స్‌ను బడా సంస్థ హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం ‘గేమ్‌ ఛేంజర్‌’ మేకర్స్ కి సదరు సంస్థ ఏకంగా రూ. 28 కోట్ల రూపాయలు అప్ప జెప్పినట్లుగా టాక్.

‘గేమ్‌ ఛేంజర్‌’ ఓవర్సీస్ రైట్స్ కోసం హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఇచ్చిన మొత్తం రామ్ చరణ్ సోలో కెరీర్‌లోనే టాప్ రికార్డు అంటున్నారు. మరి గ్లోబల్ స్టార్ గా రామ్‌ చరణ్ కి ఉన్న క్రేజ్ తోనే ఇంత భారీ డీల్ జరిగినట్లుగా చరణ్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. చరణ్ ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రానికి సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇంకా ప్రకాష్ రాజ్, సునీల్, సహా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

శంకర్ అడిగిన వెంటనే చరణ్ ఈ సినిమాకి కమిట్ అయ్యాడు. కంటెంట్ పై ఎక్కువ ఆలోచించకుండా రామ్ చరణ్ మొహమాటానికి పోయి, ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాని ఒప్పుకుని తప్పు చేశాడంటూ ? ఇప్పటికే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా ఓవర్సీస్ రైట్స్ కి భారీ డిమాండ్ దక్కడం గొప్ప విషయం. మరి ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా కలెక్షన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Also Read:Filmfare:ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌

- Advertisement -