Devara:’దేవర’కి భారీ డిమాండ్!

4
- Advertisement -

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం దేవర. రెండు పార్టులుగా వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ప్రతి ఫ్రేమ్‌ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ఇక ఇప్పటికే దేవరపై భారీ హైప్ క్రియేట్ కాగా అందుకు తగ్గట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని ఇన్‌సైడ్ టాక్. ఒక్క కోస్తాంధ్ర బిజినెసే రూ.55 కోట్లకు పైగా జరిగిందంటే దేవర రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తారక్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

Also Read:Pushpa 2:అందుకే ఆలస్యం..మేకర్స్ క్లారిటీ!

- Advertisement -