సాహో..ఓవర్సీస్ రైట్స్‌ ఎంతో తెలుసా..!

262
sahoo release date
- Advertisement -

బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరో ప్రభాస్. ప్రస్తుతం ర‌న్‌ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ప్రభాస్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో మూడు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండగా సాహోని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

ప్రభాస్ సరసన స‌ర‌స‌న‌ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ భారీగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సాహో ఓవర్‌ సీస్‌ రైట్స్‌ దాదాపు 42 కోట్లకు అమ్ముడైనట్టుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రయూనిట్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.

ఇక ఈ మూవీలో బాలీవుడ్‌ నటీ నటులు నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మందిరా బేడిలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా సాహోలో ప్రభాస్ స్టైలిష్‌గా, సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. భారీ అంచనాలు నెలకొన్న సాహోతో ప్రభాస్‌ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచిచూడాలి.

- Advertisement -