TTD: వైకుంఠ ఏకాదశి..విస్తృత ఏర్పాట్లు

0
- Advertisement -

జ‌న‌వ‌రి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించ‌నున్నారు.

అన్నమయ్య జిల్లా నంద‌లూరు మండల కేంద్రంలోని శ్రీ సౌమ్య‌నాథ‌స్వామివారి ఆలయంలో జనవరి 10న వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా ఆల‌యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉద‌యం 5 గంట‌లకు ఉత్త‌ర ద్వారా ద‌ర్శ‌నం, ఉద‌యం 8.30 గంట‌ల‌కు ల‌క్ష తుల‌సీ అర్చ‌న‌ నిర్వ‌హించ‌నున్నారు.

జ‌న‌వ‌రి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 8.45 గంట‌ల‌కు గ్రామోత్స‌వం నిర్వహించనున్నారు. జ‌న‌వ‌రి 13న గోదా క‌ల్యాణం, జ‌న‌వ‌రి 15న పార్వేట ఉత్స‌వం జ‌రుగ‌నుంది.

చిత్తూరు జిల్లా సోమల (మం)లోని ఆవుల‌ప‌ల్లి శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో జనవరి 10న వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా ఆల‌యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉద‌యం 3 నుండి 3.30 గంట‌ల వ‌ర‌కు తిరుప్పావై జ‌రుగ‌నుంది. అనంత‌రం ఉద‌యం 5 నుండి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌ను స‌ర్వ‌ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. రాత్రి 7 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు స్వామి అమ్మ‌వార్లు తిరుచ్చిపై విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్రహించ‌నున్నారు.

చిత్తూరు జిల్లా సదుం ( మం)బొర్రగమంద శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో జనవరి 10న వైకుంఠ ఏకాదశి, 11న ద్వాద‌శి ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా ఆల‌యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉద‌యం 3 నుండి 3.30 గంట‌ల వ‌ర‌కు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, అభిషేకం నిర్వహిస్తారు. అనంత‌రం ఉద‌యం 5 నుండి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌ను స‌ర్వ‌ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. రాత్రి 7 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు స్వామి అమ్మ‌వార్లు తిరుచ్చిపై విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్రహించ‌నున్నారు.

జ‌న‌వ‌రి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు. ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు గ్రామోత్స‌వం జ‌రుగ‌నుంది.

పుంగ‌నూరులోని శ్రీ క‌ల్యాణ‌ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువ జామున 12.05 నుండి 12.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. తెల్ల‌వారు జామున 2 నుండి రాత్రి 10.30 గంటల వరకు భక్తులను వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరగనుంది. అనంతరం రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు.

- Advertisement -