టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27న హైదరాబాద్ నగర శివారు కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సెంటర్‌లో టీఆర్ఎస్ ప్లీనరీని భారీ స్ధాయిలో నిర్వహించనున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 100 మందిని ఈ ప్లీనరీకి ఆహ్వానించారు. ప్లీనరీ విజయవంతానికి తొమ్మిది కమిటీలను నియమించారు సీఎం కేసీఆర్.
సభాప్రాంగణం, వేదిక, ప్రతినిధుల నమోదు పార్కింగ్, నగర అలంకరణ, వాలంటరీస్, భోజన కమిటీ, మీడియా కోఆర్డినేటర్స్, సాంస్కృతిక కమిటీలకు బాధ్యులను నియమించారు. ఇప్పటికే ఆరుగురితో తీర్మానాల కమిటీ ఏర్పాటైంది. పార్టీ ప్రతినిధులకు సాయం అందించేందుకు వలంటీర్లను నియమిస్తున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని మజ్జిగ, చల్లటి నీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్లీనరీ నిర్వహణ కమిటీలు
ఆహ్వాన కమిటీ: పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి
సభా ప్రాంగణం, వేదిక: గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
ప్రతినిధుల నమోదు, పార్కింగ్: ఎమ్మెల్యే కేవీ వివేకానంద్ గౌడ్, ఎమ్మెల్యే ఎం సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యే సీహెచ్ కనకారెడ్డి
భోజన కమిటీ: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
మీడియా కో-ఆర్డినేటర్స్: ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి
సాంస్కృతిక కమిటీ: రసమయి బాలకిషన్
నగర అలంకరణ: బొంతు రామ్మెహన్
వలంటీర్ల కమిటీ: ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, టీఎస్‌టీఎస్సీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్