Modi Oath:వివిధ దేశాధ్యక్షులకు ఆహ్వానం

14
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ సర్కార్ ప్రమాణస్వీకారానికి చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో శనివారం రాత్రి 8 గంటలకు మోడీ మూడోసారి ప్రదానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనుండగా అన్ని ఏర్పాట్లు జరుగుతన్నాయి.

వివిధ రంగాల ప్రముఖులు, అన్ని రాష్ట్రాల సీఎంలతో పాటు వివిధ దేశాధ్యక్షులను మోడీ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌, శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌, మారిషస్‌ దేశాధినేతలకు ఆహ్వానాలు వెళ్లాయి. .

2014 తర్వాత తొలిసారి బీజేపీ మేజిక్‌ ఫిగర్‌ 272 సీట్లను దాటలేక పోయింది. మంగళవారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ 292 స్థానాలను కైవసం చేసుకుంది.కూటమిలో టీడీపీ, జేడీయూ ప్రధాన పాత్ర పోషించనుంది.

Also Read:ఎంపీగా గెలిచిన చిరు హీరోయిన్!

- Advertisement -