టీవీ రిపోర్టర్‌ని లైవ్‌లోనే…

192
- Advertisement -

అంతర్జాతీయ స్థాయిలో ఆడుతూ కూడా కొన్నిసార్లు అదుపు తప్పుతుంటారు క్రీడాకారులు. గతంలో స్పెయిన్ ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ గా ఉన్న కాసిలాస్ 2010 సాకర్ ప్రపంచకప్ సందర్భంగా లైవ్ లో తనను ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మాయిని ముద్దాడటం గుర్తుండే ఉంటుంది.
 Maxime Hamou embrasse de force une journaliste d'Eurosport - Koreus
ఐతే అతను కిస్ చేసిన అమ్మాయి అతడి ప్రేయసే కావడంతో ఇబ్బంది లేకపోయింది. ఇక రెండేళ్ల కిందట క్రికెటర్ క్రిస్ గేల్.. బిగ్ బాష్ లీగ్ సందర్భంగా ఓ యాంకర్ తో అసభ్యంగా మాట్లాడి ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు.  తాజాగా ఓ టెన్నిస్ ఆటగాడు టీవీ యాంకర్ తో తేడాగా ప్రభవర్తించి టోర్నీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు.

ఇంటర్వ్యూ చేస్తున్న టీవీ రిపోర్టర్‌ పట్ల ఓ ఫ్రెంచ్ టెన్నిస్ ఆటగాడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడిని ఫ్రెంచ్ టెన్నిస్ ఓపెన్‌ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ (ఎఫ్ఎఫ్‌టీ) ప్రకటించింది. ఫ్రెంచ్ ఓపెన్ తొలిరౌండ్‌లో ఓడిపోయిన మాక్సిమ్ హామవ్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు మహిళా జర్నలిస్టు మాలీ థామస్ అతడి దగ్గరకు వెళ్లారు. మాట్లాడుతుండగానే తొలుత మాక్సిమ్ ఆమె భుజాలపై చేతులు వేశాడు. లైవ్ కావడంతో ఆమె సంయమనం కోల్పోకుండా నవ్వుతూనే ఇంటర్వ్యూ చేశారు. ఇంతలో ఉన్నట్టుండి అతగాడు న్యూస్ రిపోర్టర్‌కు ముద్దులివ్వడం మొదలుపెట్టాడు. ఎంతవారిస్తున్నా పట్టించుకోకుండా అసభ్యంగా ప్రవర్తించాడు.
Maxime Hamou embrasse de force une journaliste d'Eurosport - Koreus
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో పాటు… నెటిజన్లు ఆటగాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు టీవీ ఛానెల్ ‘యూరోస్పోర్ట్స్’ యాజమాన్యం టెన్నిస్ ఆటగాడి ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాలీ అత్యంత గౌరవనీయురాలైన జర్నలిస్టు అని కొనియాడింది. ఇక ఈ సంఘటనపై టీవీ రిపోర్టర్ మాలీ స్పందిస్తూ… లైవ్ కాబట్టి ఊరుకున్నానని లేకుంటే అతడి చెంప చెళ్లుమనిపించేదానినని పేర్కొన్నారు.

https://www.youtube.com/watch?v=K27THYJpcSE

- Advertisement -